33 మందికి విమాన టికెట్లు బుక్‌ చేసిన ఎంపీ

AAP MP Sanjay Singh Uses 33 MP Quota Flight Tickets For Migrants - Sakshi

వలస కార్మికులపై ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఉదారత

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సాయమందించారు. ఢిల్లీలో చిక్కుకుపోయిన 33 మంది బిహార్‌ వాసులను విమానంలో తీసుకెళ్లేందుకు టికెట్లు బుక్‌ చేశారు. ఎంపీ కోటాలో తనకు కేటాయించే 34 బిజినెస్‌ క్లాస్‌ టికెట్లకు ఎంపీ బుక్‌ చేశారని ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయం తెలిపింది. వలస కార్మికులతో పాటు ఎంపీ సంజయ్‌ కూడా గురువారం సాయంత్రం బిహార్‌ వెళ్తారని వెల్లడించింది. ఎంపీ చొరవను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రశంసించారు. ‘దేవుడు ఇతరుల సేవకై పనిచేసే అవకాశాలు ఇచ్చినప్పుడు. వాటిని బాధ్యతగా నెరవేర్చాలి. ఎంపీ సంజయ్‌ అభినందనీయుడు’అని సీఎం పేర్కొన్నారు. ప్రజా సేవకై రాజకీయాల్లోకి వచ్చానని, సీఎం కేజ్రీవాల్‌ సారథ్యంలో ఎప్పుడూ ప్రజా సేవకు అంకితమవుతానని ఎంపీ ట్విటర్‌లో రిప్లై ఇచ్చారు. కాగా, ప్రతియేడు ఎంపీలకు 34 బిజినెస్‌ క్లాస్‌ టికెట్లను విమానయాన శాఖ కేటాయిస్తుంది.
(చదవండి: ముంబైని తాకిన నిసర్గ తుఫాను)

Read latest Delhi News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top