తమ్ముడు మందలించాడని.. | Young Woman Commits Suicide in Visakhapatnam | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

Nov 2 2019 11:30 AM | Updated on Nov 2 2019 11:31 AM

Young Woman Commits Suicide in Visakhapatnam - Sakshi

ఉమాదేవి మృతదేహం

చీడికాడ (మాడుగుల): మండలంలోని ఖండివరంలో మనస్తాపానికి గురైన యువతి శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్‌ఐ యల్‌.సురేష్‌కుమార్‌ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆయన కథనం మేరకు వివరాలిలావున్నాయి. గ్రామానికి చెంది న బంగారు ఉమాదేవి(19) శుక్రవారం నాగుల చవితి సందర్భంగా షాపింగ్‌ నిమిత్తం చోడ వరం వెళ్లింది. ఆమె ఆలస్యంగా ఇంటికి రావడంతో ఆమె తమ్ముడు సాయికుమార్‌ మందలించాడన్నా రు. శనివారం ఉద యం చూడగా ఆమె చున్నీ తో ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించడంతో సాయికుమార్‌ పోలీసులకు సమాచా రం ఇచ్చారన్నారు. తమ్ముడు మందలించాడని మనస్తాపంతోనే ఉమాదేవి ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని ఆయన వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement