పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి ఇంటి ముందే.. | Young Man Suicide Over Lover Not Accepted To Marry Him | Sakshi
Sakshi News home page

పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి ఇంటి ముందే..

Jan 26 2019 4:12 PM | Updated on Jan 26 2019 4:48 PM

Young Man Suicide Over Lover Not Accepted To Marry Him - Sakshi

చెన్నై: ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోలేదన్న మనస్తాపంతో ఆమె ఇంటి వద్దే ఓ యువకుడు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని అన్నానగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కన్యాకుమారి జి ల్లా ఇరణియల్‌ సమీపం తింగల్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ప్రదీప్‌ (29) మినీ బస్సు డ్రైవర్‌. ప్రేమ వివాహం చేసుకున్న ఇతనికి సునిప్రియా (25) అనే భార్య, బిడ్డ ఉంది. ప్రదీప్‌ డ్రైవర్‌గా పని చేస్తున్న మినీ బస్సులో ఓ యువతి రోజు కళాశాలకు వెళ్లి వచ్చేది. దీంతో ఇద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కాగా ప్రదీప్‌కు అప్పటికే వివాహం జరిగి బిడ్డ ఉన్నట్లు ఆ యువతికి తెలిసింది. దీంతో ప్రదీప్‌ను దూరం పెట్టింది.

అయినప్పటికీ ప్రదీప్‌ ఆమెను కలుసుకొని తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. విద్యార్థిని ఒప్పుకోకపోవడంతో ఆమెపై దాడి చేశాడు. దీనిపై సదరు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కులచ్చల్‌ పోలీసులు ప్రదీప్‌ను పిలిచి మందలించి పంపారు. ఈ స్థితిలో ప్రదీప్‌ తక్కలై సమీపంలోని యువతి ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. యువతి ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆమె ఇంటి ముందే శరీరంపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది చూసిన స్థానికులు మంటలను ఆర్పి ప్రదీప్‌ను చికిత్స కోసం ఆసారిపల్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ప్రదీప్‌ మృతి చెందాడు. తక్కలై పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement