పశ్చిమ గోదావరిలో ప్రేమోన్మాది ఘాతుకం | Young Man Murder His Lover, ​After ​He commits Suicide In West Godavari | Sakshi
Sakshi News home page

Jun 20 2018 9:19 AM | Updated on Aug 21 2018 6:08 PM

Young Man Murder His Lover, ​After ​He commits Suicide In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైంది. తనను ప్రేమించలేదనే కోపంతో కత్తితో నరికి చంపి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం బాపుజీ కాలనీలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలివి.. ప్రేమ పేరుతో కిరణ్‌ గత కొంత కాలంగా లహరిని వేధిస్తున్నాడు. అతనిపై ఆ యువతిని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. 

ఇటీవల ఆ యువతికి మరొకరితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఆ యువతిపై కక్ష పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమాచారం సేకరిస్తున్నారు. మృతులు జంగారెడ్డిగూడెంకు చెందిన లహరి, కిరణ్‌లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement