రైలు నుంచి జారి పడి యువకుడి మృతి  | Young Man Fell Down From Moving Train Is Dead | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారి పడి యువకుడి మృతి 

Apr 1 2018 7:13 AM | Updated on Oct 9 2018 5:43 PM

Young Man Fell Down From Moving Train Is Dead - Sakshi

గాయాలతో ఇక్బాల్‌ (తర్వాత ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు)

కారేపల్లి : ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి యువకుడు మృతి చెందిన ఘటన కారేపల్లి రైల్వే స్టేషన్‌లో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కారేపల్లి రైల్వే స్టేషన్‌ బజార్‌కు చెందిన షేక్‌ ఇక్బాల్‌ (33) రైల్వే స్టేషన్‌కు ఎదురుగా హోటల్‌ నిర్వహిస్తున్నాడు. స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు ఇక్బాల్‌ వాటర్‌ బాటిల్, ఫ్రూట్‌ బాటిల్స్‌  అమ్ముతుంటాడు.

ఎప్పటిలాగే కొత్తగూడెం నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్యాసింజర్‌ కారేపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే వాటర్, ఫ్రూట్‌ బాటిల్స్‌తో ఇక్బాల్‌ ఆగి ఉన్న రైలు ఎక్కి అమ్మాడు.  రైలు కదులుతున్న సమయంలో ప్లాట్‌ఫాం వైపు కాకుండా మరో వైపు దిగే క్రమంలో రైలు కింద పడి పోయాడు. సుమారు 20 మీటర్ల మేర వరకు రైలు లాక్కెల్లింది. తీవ్ర గాయాలపాలైన ఇక్బాల్‌ను గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని  ఖమ్మంలో ఓ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ ఇక్బాల్‌ మృతి చెందాడు. అందరితో కలువుడిగా ఉంటూ సుపరిచితుడిగా పేరున్న ఇక్బాల్‌ మరణ వార్తతో స్నేహితులు దుఃఖ సాగరంలో మునిగిపో యారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఇక్బాల్‌ మృతి చెందటంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచక గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మృతుడు ఇక్బాల్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి వీరాభిమాని కాగా, వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీ సెల్‌ నాయకుడిగా కొనసాగుతున్నాడు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement