ఎలుకల మందు పరీక్షించబోయి..

Young Man Died By Having Ratkiller Unexpectedly In Krishna District - Sakshi

కృష్ణా జిల్లా: ఓ యువకుడి తెలివితక్కువతనం అతడి ప్రాణాలు పోయేలా చేసింది. తాను కొనుక్కొచ్చిన మందు సరిగ్గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి రుచి చూశాడు. దీంతో అస్వస్థతకు లోనైన ఆ యువకుడిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో చోటుచేసుకుంది.

స్థానికంగా నివాసముంటున్న రాబర్ట్‌ అనే యువకుడు ముసునూరు మండలంలోని చర్చిలో పాస్టర్‌గా శిక్షణ పొందుతున్నాడు. చర్చిలో ఎలుకల బెడద ఎక్కువగా ఉండటంతో ఎలకల నివారణ మందు తీసుకువచ్చి రుచి చూసి ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాబర్ట్‌ కిస్పోటా మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top