యువకుడి ఆత్మహత్య | Young Man Commits Suicide in East Godavari | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Nov 28 2018 10:45 AM | Updated on Nov 28 2018 10:45 AM

Young Man Commits Suicide in East Godavari - Sakshi

కాకినాడ జీజీహెచ్‌లో వీరాస్వామికి చికిత్స చేస్తున్న వైద్యులు

తూర్పుగోదావరి , యానాం (ముమ్మిడివరం): తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. సుంకరపాలెంలో ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న కట్టా వీరాస్వామి(17) మంగళవారం తన స్వగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరిన అతడిని కుటుంబసభ్యులు యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. స్థానిక వైద్యులు ముందుగా చనిపోయాడని భావించారు. అయితే వైద్యులు సపర్యలు చేయగా అతడు శ్వాస తీసుకుంటున్నట్టు గుర్తించి తక్షణం మెరుగైన వైద్యం కోసం యానాం అంబులెన్స్‌లో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అయితే వీరాస్వామి అక్కడ చికిత్స పొందూతూ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఘటన స్థలం కోరంగి పోలీస్‌స్టేషన్‌ పరిధికి వస్తుండడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement