ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య | Young Man Commits Suicide In East Godavari | Sakshi
Sakshi News home page

ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

Nov 21 2018 9:03 AM | Updated on Nov 21 2018 9:03 AM

Young Man Commits Suicide In East Godavari - Sakshi

ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న యువకుడు వెంకట రమణ

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తాడితోట, వీరభద్రనగర్‌కు చెందిన బొడ్డుపల్లి వెంకటరమణ(21) డిగ్రీ వరకు చదివాడు. మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తల్లి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సేపటికి గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని కిందకి దించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. వన్‌టౌన్‌ సీఐ ఆదేశాల మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement