నడిరోడ్డుపై హత్య చేసి తలతో పోలీస్‌ స్టేషన్‌కి.. | Young Man Brutally Murdered In Nalgonda | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై హత్య చేసి తలతో పోలీస్‌ స్టేషన్‌కి..

Jul 20 2019 9:12 PM | Updated on Jul 20 2019 10:09 PM

Young Man Brutally Murdered In Nalgonda - Sakshi

రోడ్డుపై పడివున్న తలలేని మృతదేహం, ఇన్‌సెట్‌లో మృతుడు సద్దాం

సాక్షి, నల్గొండ :  జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాత కక్షలతో అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ యువకుడిని హతమార్చి అనంతరం నరికిన తలతో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే... నాంపల్లి మండలం నేరేళ్లపల్లికి చెందిన సద్దాం స్థానికంగా ఉండే ఓ యువతితో సన్నిహితంగా ఉండేవాడు. అయితే వారిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

కాగా, ఆమె ఆత్మహత్య చేసుకోలేదని, సద్దామే హత్య చేశాడని భావించిన ఆమె సోదరుడు గౌస్‌ అతన్ని చంపాలని కుట్ర పన్నాడు. స్నేహితుడు ఇమ్రాన్‌తో కలిసి  సద్దాంను అత్యంత దారుణంగా హతమార్చాడు.  హత్య అనంతరం సద్దాం తలని సంచిలో వేసుకుని పోలీసులకు లొంగిపోయాడు. మరోవైపు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement