మందలించినందుకు యువతి.. | Young Girl Suicide Attempt Warangal | Sakshi
Sakshi News home page

మందలించినందుకు యువతి..

Feb 4 2019 11:51 AM | Updated on Mar 6 2019 8:09 AM

Young Girl Suicide Attempt Warangal - Sakshi

సుభధ్ర(ఫైల్‌)  

ఖానాపురం: ఉరేసుకొని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని కోమటిపల్లి తండాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్య సుభద్ర(20) ఇంటి వద్ద సరిగా పనులు చేయడం లేదు.

దీంతో తల్లి  గుగని పనులు చేయకుండా ఖాళీగా ఉంటే ఎలా అంటూ మందలించి అన్నారంకు వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సుభద్ర ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి కుటుంభ సభ్యులు ఇంటికి చేరుకుని చూడగా ఉరేసుకొని ఉంది.  మృతురాలి అన్న భూక్య శంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement