వివాహేతర సంబంధమే కారణం... | Women Murder In Karimnagar | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే హత్య

Jul 23 2018 8:24 AM | Updated on Jul 23 2018 8:24 AM

Women Murder In Karimnagar - Sakshi

మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీసీపీ సుదర్శన్‌గౌడ్‌

సుల్తానాబాద్‌(పెద్దపల్లి): స్నేహాన్ని అడ్డుపెట్టుకుని తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో భర్త రమేశ్‌ పథకం ప్రకారం.. సుల్తానాబాద్‌ మండలం కనుకుల గ్రా మానికి చెందిన ఎండీ షఫీ(32)ని హత్యచేశాడు. మృతదేహాన్ని మండలంలో తొగర్రాయి మానేరువాగు నుంచి ఆదివారం వెలికితీశారు. మంగళ వారం రాత్రి నుంచి షఫీ కనిపించకపోవడంతో అతడి తండ్రి రహీమొద్దీన్‌ శుక్రవారం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శనివారం వాగులోమృతదేహం కనిపించింది. ఆదివారం తహసీల్దార్‌ రజిత సమక్షంలో పోలీసులు శవాన్ని వెలికితీశారు. దుర్వాసన వస్తుండడంతో సంఘటన స్థలంలోనే మృతదేహానికి డాక్టర్‌లు హుమాయూన్, స్వాతి పో స్ట్‌మార్టం నిర్వహించారు. సంఘటన స్థలాన్ని పె ద్దపల్లి  డీసీపీ సుదర్శన్‌గౌడ్, ఏసీపీ హబీబ్‌ఖాన్, íసీఐ రాములు, ఎస్సై రాజేశ్‌లు పరిశీలించారు.
 
వివాహేతర సంబంధమే కారణం... 
కనుకుల గ్రామానికి చెందిన కురిక్యాల రమేశ్‌ తన భార్యతో షఫీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో హత్య చేయడానికి ప్రణాళిక రూపొందిచాడు. రమేశ్‌ అతడి స్నేహితుడు శ్రీనివాస్, షఫీ మంగళవారం రాత్రి మద్యం తాగేందుకు వెళ్లారు. మద్యం తాగిన అనంతరం మత్తులో ఉన్న షఫీని రమేశ్, శ్రీనివాస్‌లు తొగర్రాయి గ్రామ సమ్మక్క సారలమ్మ జాతర గుట్ట మీదకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కిందికి తోసేశారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో గొం తు నులిమి చంపేశారు. పక్కనే ఉన్న మానేరువా గులో పూడ్చివేశారు. రమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌ పరారీలో ఉన్నాడు.అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement