క‌దులుతున్న బ‌స్సులో మ‌హిళ‌పై అత్యాచారం | Women Molested On Moving Bus In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో మ‌రో నిర్భ‌య ఉదంతం..

Jun 18 2020 9:59 AM | Updated on Jun 18 2020 10:47 AM

Women Molested On Moving Bus In Uttar Pradesh - Sakshi

లక్నో: ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో మ‌రో నిర్భ‌య ఉదంతం వెలుగు చూసింది. క‌దులుతున్న బ‌స్సులో మ‌హిళ అత్యాచారానికి గురైంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 25 ఏళ్ల మ‌హిళ త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకుని బుధ‌వారం ప్ర‌తాప్‌ఘ‌ర్ నుంచి నోయిడా వెళ్లేందుకు ప్రైవేటు బ‌స్సు ఎక్కింది. ఈ క్ర‌మంలో ఆమెపై క‌న్నేసిన ఇద్ద‌రు బ‌స్సు డ్రైవ‌ర్లు ఆమెను వెన‌క సీటులో కూర్చోమ‌న్నారు. అనంత‌రం మ‌హిళ‌ను చంపుతామ‌ని బెదిరిస్తూ క‌దులుతున్న‌ బ‌స్సులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నోయిడాలో బ‌స్సు దిగిన వెంట‌నే ఆమె భ‌ర్త స‌హకారంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. (‘నిర్భయ’దోషులకు ఉరి)

ఈ ఘ‌ట‌న‌పై ఐపీసీ సెక్ష‌న్ 376, 506 కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. దారుణానికి పాల్ప‌డ్డ నిందితుల్లో ఒక‌రిని అదుపులోకి తీసుకోగా, మ‌రో నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టారు. అనంత‌రం బ‌స్సును స్వాధీనం చేసుకున్నారు. ల‌క్నో- మ‌ధుర మ‌ధ్య మ‌హిళపై లైంగిక దాడికి పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. మ‌హిళ‌ను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. (అక్రమ దత్తత: బాలుడి దీనగాద)

Advertisement
 
Advertisement
Advertisement