అనధికార మద్యాన్ని పట్టించిన మహిళా పోలీసు

Woman Police Catched Alcohol Smuggling Gang in East Godavari - Sakshi

అండగా నిలిచిన సహచర ఉద్యోగులు  

తూర్పుగోదావరి, మామిడికుదురు: సముద్ర తీరంలోని కరవాక గ్రామంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వారి ఆట కట్టించారు సచివాలయ మహిళా పోలీసు. సహచర సచివాలయ ఉద్యోగులతో కలిసి ఆమె మద్యం విక్రయిస్తున్న రేకాడి వెంకటసూర్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఇంటి పంచన సంచిలో రహస్యంగా దాచి ఉంచిన మద్యం సీసాలను ధన్యశ్రీ స్వాధీనం చేసుకున్నారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకుంటున్న ధన్యశ్రీని సూర్యనారాయణ కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ వారిని లెక్క చేయకుండా 22 మద్యం బాటిళ్లతో ఉన్న సంచిని స్వాధీనం చేసుకుని గ్రామ పంచాయతీకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో సహచర సచివాలయ ఉద్యోగులు మహిళా పోలీసుకు అండగా నిలిచారు. అనంతరం సమాచారాన్ని నగరం పోలీసుకు అందించారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను నగరం పోలీసులకు స్వాధీనం చేశామని పంచాయతీ కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎంతో తెగువ చూపిన మహిళా పోలీసుతో పాటు సచివాలయ ఉద్యోగులను స్థానికులు అభినందించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top