వీడిన మహిళ హత్య మిస్టరీ | woman murder mystery revealed | Sakshi
Sakshi News home page

వీడిన మహిళ హత్య మిస్టరీ

Feb 7 2018 7:39 AM | Updated on Jul 30 2018 8:41 PM

woman murder mystery revealed - Sakshi

హత్యకు గురైన శాంతలక్ష్మి (ఫైల్‌)

తిరువళ్లూరు: మహిళ హత్య కేసుకు సంబంధించి మిస్టరీ వీడింది. వెళ్లవేడు పోలీసులు కేసు విచారణలో పురోగతి సాధించారు. హత్యకు గురైన మహిళ భవన కార్మికురాలిగా గుర్తించిన పోలీసులు గుర్తించారు. అనుమానం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తిరువళ్లూరు జిల్లా వెళ్లవేడు సమీపంలోని తిరుమణం గ్రామానికి సమీపంలోని నెమిలిచ్చేరి–వండలూరు హైవే బ్రిడ్జి వద్ద 3న తేదీన మహిళను దారుణంగా హత్య చేసి పడేసిన సంఘటన కలకలం సృష్టించించిన విషయం తెలిసిందే. మహిళ శరీరంపై గాయాలు ఉండడంతో హత్యాచారం ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే హత్యకు గురైన మహిళ ఆచూకీ గుర్తించడంలో పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు పోలీసులకు క్లూ దొరకడంతో దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

మిస్సింగ్‌ కేసుల ఆధారంగా దర్యాప్తు : మహిళ హత్య కేసును వేగంగా ఛేదించాలన్న ఉద్దేశంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తును చేపట్టారు. తిరువళ్లూరు కాంచీపురం, చెన్నై, వేలూరు జిల్లాలో అదృశ్యమైన మహిళల వివరాలను సేకరించారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం చెన్నై ఎస్‌ఏ నగర్‌ వ్యాసార్పాడికి చెందిన మునస్వామి తన భార్య ఆదృశ్యమైందని కొడుంగయూర్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అక్కడి పోలీసుల సూచనల మేరకు వెళ్లవేడుకు వచ్చిన మునస్వామిని పోలీసులు తిరువళ్లూరు వైద్యశాలకు తీసుకొచ్చి మృతదేహాన్నీ చూపించారు.  మృతదేహం తన భార్యదేనని తాïపీ పనుల కోసం 2వ తేదీన ఇంటి నుంచి వెళ్లి ఇంటికి రాలేదని పోలీసులకు వివరించారు. పోలీసులు మునస్వామి ఇచ్చిన సమాచారంతో  మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అనంతరం పోలీసులు దర్యాప్తును ము మ్మరం చేశారు. శాంతలక్ష్మి సెల్‌ఫోన్‌ ఆధారంగా కాల్‌డేటాను తీసి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement