సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడుతున్న మహిళ అరెస్ట్‌

Woman Arrested in Cell Phone Robbery Case - Sakshi

నాగోలు: ఓఎల్‌ఎక్స్‌ ద్వారా  సెల్‌ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న మహిళను ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్టు చేసి అమె నుంచి రూ. 3.40 లక్షల విలువైన  సెల్‌పోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్‌ డీఐ కృష్ణ మోహన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన అల్లారి భాను అరవింద చౌదరి నగరానికి వచ్చి  సరూర్‌నగర్‌లో ఉంటోంది. జల్సాలకు అలవాటు పడిన ఆమె సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో సెల్‌ ఫోన్లు విక్రయించేందుకు ప్రకటనలు ఇచ్చేవారిని సంప్రదించేది. వారిని తాను ఎంచుకున్న ప్రాంతానికి రప్పించి సెల్‌ఫోన్‌ ఇంట్లో వాళ్ల చూపిస్తానని వస్తానని చెప్పి పరారయ్యేది. ఇదే తరహాలో ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు,  సైదాబద్‌లో ఒకరిని మోసం చేసింది. బాధితుల ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన  ఎల్‌బీనగర్‌ పోలీసులు మంగళవారం నిందితురాలిని  అరెస్టు చేసి అమె నుంచి నాలుగు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌ తరలించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top