కుటుంబం మృత్యువాత; జాడ లేని భర్త | Woman And Three Daughters Found Dead In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

ముగ్గురు మైనర్‌ పిల్లలతో సహా మహిళ మృతి

Feb 3 2020 9:18 AM | Updated on Feb 3 2020 9:33 AM

Woman And Three Daughters Found Dead In Madhya Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ వివాహిత, తన ముగ్గురు మైనర్‌ పిల్లలతో సహా మృతి చెందిన ఘటన స్థానికులను కలిచివేసింది. అక్కల్‌పూర్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో ముప్పైయేళ్ల లక్ష్మీబాయి, తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో.. ఆదివారం నాడు లక్ష్మీతోపాటు ముగ్గురు పిల్లలు విగత జీవులుగా కనిపించారు. మృతుల్లో ఐదు సంవత్సరాల చిన్నారితో పాటు, నెల కూడా నిండని పసికందు ఉండటం గమనార్హం. ఇది హత్యా, ఆత్మహత్యా అన్న వివరాలు తెలియరాలేదు. అయితే మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వీరి మృతికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఇక కనిపించకుండా పోయిన మహిళ భర్త  కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: 

భర్తే విషమిచ్చి హతమార్చాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement