భర్త గొంతు నులిమి చంపిన భార్య | Wife Killed Husband In Suryapeta | Sakshi
Sakshi News home page

భర్త గొంతు నులిమి చంపిన భార్య

Jun 21 2018 2:42 PM | Updated on Jun 21 2018 2:42 PM

Wife Killed Husband In Suryapeta - Sakshi

శ్మశానవాటిక వద్ద గుమిగూడిన ప్రజలు

కట్టంగూర్‌(నకిరేకల్‌) :  భార్య చేతిలో భర్త హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలి పిన వివరాల ప్రకారం.. కట్టంగూర్‌ మండలం అయిటిపాముల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొత్తపల్లి వెంకన్న(40) ఈనెల 15న రాత్రి మృతిచెందాడు. బంధువులు సహజమర ణం అనుకుని గ్రామంలోని సబ్‌స్టేషన్‌ సమీపంలో 16న అంత్యక్రియలు నిర్వహించారు.

బుధవారం గ్రామంలో చిన్నకర్మ జరిపేందుకు వచ్చిన మృతుడి బంధువులు అనుమానంతో వెంకన్న భార్య స్వర్ణను గట్టిగా నిలదీయడంతో తానే గొంతు పిసికి చంపానని ఒప్పుకుంది. దీంతో మృతుడి తమ్ముడు కొత్తపల్లి శ్రీను పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌హెచ్‌ఓ మురళీకృష్ణ కేసు నమోదు చేశారు.

తహసీల్దార్‌ తిరందాసు వెంకటేశం, శాలిగౌరారం రూరల్‌ సీఐ క్యాస్ట్రోరెడ్డి, నకిరేకల్‌ ప్రభుత్వ వైద్యాధికారి శ్మశాన వాటిక వద్దకు వెళ్లి శవాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. సీఐ స్వర్ణను విచారించగా తన భర్త నిత్యం మద్యం తాగివచ్చి ఇబ్బందులకు గురిచేసే వాడని, కుటుంబ పోషణ పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో విసిగెత్తి గొంతు నులిమి చంపినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి హత్య వెనక ఉన్నవారిని కూడా అరెస్ట్‌ చేస్తామని సీఐ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement