భర్తకు విడాకులివ్వకుండా రెండో వివాహం | Wife And Husband Arrested in Second Marriage Case | Sakshi
Sakshi News home page

భర్తకు విడాకులివ్వకుండా రెండో వివాహం

Jul 9 2019 7:26 AM | Updated on Jul 13 2019 11:11 AM

Wife And Husband Arrested in Second Marriage Case - Sakshi

నిందితులు రాధిక, శశికుమార్‌

యువతి, రెండో భర్త అరెస్టు

చైతన్యపురి: భర్తకు విడాకులివ్వకుండా మరో వ్యక్తిని వివాహమాడిన యువతిని, రెండో భర్తను చైతన్యపురి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ సాయిప్రకాష్‌ తెలిపిన వివరాల ప్రకారం...వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం సీతారామపురం గ్రామానికి చెందిన కొత్తూరు ప్రశాంత్‌ వివాహం అదే జిల్లాకు చెందిన భిక్షపతి కూతురు రాధికతో ఐదేళ్ల క్రితం  వివాహం జరిగింది. ప్రశాంత్‌ వరంగల్‌లో ఉద్యోగి కాగా... రాధిక ఎల్‌బీనగర్‌లోని ఓ ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తూ చైతన్యపురి స్టేషన్‌ పరిధిలోని ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటోంది.

గత నెల భార్యను తీసుకెళ్లేందుకు ప్రశాంత్‌ నగరానికి రాగా రాధిక హాస్టల్‌ నుంచి అదృశ్యమైంది. దీంతో ప్రశాంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.  అయితే విచారణలో బోడుప్పల్‌కు చెందిన సేల్స్‌మెన్‌ శశికుమార్‌ను చట్టవిరుద్ధంగావివాహం చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో భర్తకు విడాకులు ఇవ్వకుండా వివాహం చేసుకున్నందుకు రాధిక, ఆమె 2వ భర్తపై కేసు నమోదు చేసి సోమవారం అరెస్ట్‌ చేసిన పోలీసులు ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement