అంతర్రాష్ట్ర చీటింగ్‌ ముఠా అరెస్టు | West Zone Task Force Police Arrested Interstate Cheaters In Hyderabad | Sakshi
Sakshi News home page

Jul 6 2018 4:54 PM | Updated on Jul 6 2018 4:59 PM

West Zone Task Force Police Arrested Interstate Cheaters In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రాపర్టీ లోన్స్‌, మెడిల్‌ సీట్లు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులను శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. హైదరాబాద్‌, చెన్నై నగరాల్లోని 9 పోలీస్‌ స్టేషన్లలో వీరిపై కేసులు ఉన్నట్లు వెల్లడించారు.  తెలంగాణ, తమిళనాడు  రాష్ట్రాల ప్రజల నుంచి దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని పోలీసులు తెలిపారు.  నిందితులు సతీషన్‌, రాం నివాస్‌, హరి నివాస్‌ల వద్ద నుంచి 45 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని సీపీ అంజన్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement