ఆ యువకుడిని పట్టుకుంటాం : డీఎస్పీ | we will catch the abuser: medak dsp | Sakshi
Sakshi News home page

ఆ యువకుడిని పట్టుకుంటాం : డీఎస్పీ

Feb 6 2018 5:28 PM | Updated on Sep 15 2018 3:59 PM

we will catch the abuser: medak dsp - Sakshi

చిన్నశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాల పనితీరును పరిశీలిస్తున్న డీఎస్‌పీ రామ్‌గోపాల్‌రావు

చిన్నశంకరంపేట(మెదక్‌): ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవాలని దళిత యువతిని వేధిస్తున్న యువకుడిని త్వరలో అరెస్టు చేస్తామని తూప్రాన్‌ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు తెలిపారు. సోమవారం చిన్నశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో బాధితులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. చిన్నశంకరంపేటకు చెందిన దళిత యువతిని అదే గ్రామానికి చెందిన నిద్రబోయిన స్వామి ఐదు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలిపారు. పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపినట్లు తెలిపారు. యువకుడిని త్వరలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని  పోలీసులు తెలిపారు.

సీసీ కెమెరాలతో నేరాల అదుపు
సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయడానికి చర్యలు చేపట్టినట్లు తూప్రాన్‌ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు తెలిపారు. తూప్రాన్‌ సబ్‌డివిజన్‌లో ఇప్పటికే 450 సీసీ కెమెరాలను అమర్చినట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement