వేధింపులపై వారే సీఎంకు లేఖ రాశారు | Vice Chancellor Investigated Over Molestation At Nannaya University | Sakshi
Sakshi News home page

వేధింపులపై వారే సీఎంకు లేఖ రాశారు

Oct 12 2019 2:19 PM | Updated on Oct 12 2019 2:27 PM

Vice Chancellor Investigated Over Molestation At Nannaya University - Sakshi

సాక్షి, రాజానగరంఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌. సూర్యరాఘవేంద్రపై వచ్చిన లైంగిక వేధింపులపై ప్రాథమిక విచారణ చేపట్టిన యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ సురేష్‌వర్మ శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు. వేధింపులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖను 2017- 19 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులుగా గుర్తించామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ ముగ్గురు విద్యార్థినిలకు ఫోన్లు చేస్తే.. సరిగా రెస్పాండ్ కావడం లేదనీ.. అంతేకాక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారని తెలిపారు. ఫిర్యాదు చేసిన విద్యార్థినులు యూనివర్సిటీలో ఉన్న సమయంలో తాను వీసీగా లేనని అన్నారు.  ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్న విద్యార్థులు ఎవరైనా తెలుగులో ఉత్తరం రాస్తారా..? పైగా విద్యార్థులు రాసిన లేఖలో వారి సంతకాలు కూడా లేవని సందేహం వ్యక్తపరిచారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి, ఇందులో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో తెలుసుకుని యూనివర్సిటీ తరఫున క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు. 

చదవండి: నన్నయ వర్సిటీలో లైంగిక వేధింపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement