
సాక్షి, నెల్లూరు : నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని బుధవారం ఉదయం హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. నేతాజి నగర్‌లో ఆరో వీధిలో ఉంటున్న విశ్రాంత రెవెన్యూ ఉద్యోగిని వసంత కుమారిని హత్య చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసుల వెంటనే రంగంలోకి దిగారు. నగదు, ఆభరణాల కోసమే ఆమెను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. డాగ్ స్కాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు, దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.