గండిపేట గుట్టల్లో అమెరికా సైక్లిస్ట్‌ మృతి 

US Citizen Deceased Accidentally During Cycling - Sakshi

రాజేంద్రనగర్‌: సైక్లింగ్‌ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి అమెరికా వాసి మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన జాన్‌ రాబర్ట్‌ పాల్‌ (38), ఆయన  భార్య అంజలీనాతో కలసి గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. అంజలీనా హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. రాబర్ట్‌ ఆదివారం ఉదయం ఇంటినుంచి సైక్లింగ్‌కి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొబైల్‌ సిగ్నల్‌ ఆధారంగా పోలీసులు గాలించగా ఖానాపూర్‌ గండిపేట రిజర్వాయర్‌ ప్రాంతంలో ఉన్న గుట్టల మధ్య రాబర్ట్‌ పాల్‌ మృతదేహం కనిపించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top