గుర్తు తెలియని యువతి ఆత్మహత్య? | Unclear woman suspected of death in barampuram | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని యువతి ఆత్మహత్య?

Feb 2 2018 6:26 PM | Updated on Nov 6 2018 7:53 PM

Unclear woman suspected of death in barampuram - Sakshi

అనుమానస్పదంగా చెట్టుకు వేలాడుతున్న గుర్తుతెలియని యువతి మృతదేహం

బరంపురం: గంజాం జిల్లాలోని కళ్లికోట్‌ అటవీ ప్రాంతంలో గురువారం చెట్టుకు వేలాడుతున్న గుర్తుతెలియని యువతి మృతదేహం స్థానికుల కంటపడింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. వివరాలిలా ఉన్నాయి. కళ్లికోట్‌ బ్లాక్‌, పకురుషోత్తంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల అటవీ ప్రాంతంలో బధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు యువతిని హత్య చేసిన అనంతరం చెట్టుకి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు సందేహిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న యువతి మృతదేహం గుర్తు పట్టలేదని అయితే యువతి శరీరంపై గాయాలు ఉండడంతో అది ఆత్మహత్య కాదు. హత్యే అని అనుమానాలు బలపడుతున్నాయని పోలీసులు తెలియజేస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చిన అనంతరం యువతిది హత్యా? లేక ఆత్మహత్యా? అన్నది నిర్ధారించగలమని పోలీసులు తెలియజేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement