కుమార్తెను వేధిస్తున్నాడని..

Uncle Knife Attack On Son In law - Sakshi

అల్లుడిని పొడిచిన మామ

పహాడీషరీఫ్‌: కుమార్తెను తరచూ వేధిస్తున్నాడన్న కోపంతో  ఆగ్రహంతో అల్లుడిపై కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని బాలాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సై మక్బూల్‌ జానీ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రకుంట, తూర్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ జాఫర్‌ కుమార్తె షాహిన్‌ బేగం, ఇదే ప్రాంతానికి చెందిన షేక్‌ హసన్‌ ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. గత కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న షేక్‌ హసన్‌ ఆమెను వేధిస్తున్నాడు. ఈ విషయమై పలుమార్లు జాఫర్‌ అతడికి నచ్చజెప్పాడు. అయినా తీరు మార్చుకోని హసన్‌ ఆదివారం సాయంత్రం భార్యను కొట్టడంతో ఆమె తండ్రికి ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన జాఫర్‌ కత్తితో హసన్‌ కడుపులో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు నిందితుడు జాఫర్‌ను అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top