కొడుకు లేని సమయంలో కోడలిపై మామ.. | Uncle Harassment On Daughter In Law Warangal | Sakshi
Sakshi News home page

కొడుకు లేని సమయంలో కోడలిపై మామ..

Oct 11 2018 12:05 PM | Updated on Oct 15 2018 1:26 PM

Uncle Harassment On Daughter In Law Warangal - Sakshi

సాక్షి, గూడూరు (వరంగల్‌): గూడూరు మండలంలోని రాములు తండా శివారు చిర్రకుంట తండాలో కోడలిపై మామ అత్యాచారయత్నానికి పాల్పడగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాసిన్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిర్రకుంటతండాకు చెందిన బానోతు అనితపై ఆమె మామ మంజ్య గత ఆరునెలలుగా తన భర్త ఇంటి వద్ద లేని సమయం చూసి శారీరకంగా లొంగదీసుకునేందుకు యత్నించాడు.

ఈ నెల 7వ తేదీ రాత్రి కూడా తన భర్త ఇంట్లో లేని సమయంలో మామ తనపై అత్యాచారయత్నం చేయగా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు చెప్పుకోవాల్సి వచ్చిందని  పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనిత ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement