
ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కతా ప్లేస్కూల్‌లో దారుణం..
కోల్‌కతా : మహానగరం కోల్‌కతాలోని ఓ ప్లేస్కూల్‌లో రెండేళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. వైద్యపరీక్షలో లైంగిక వేధింపులు జరిగినట్టు నిర్ధారణ కావడంతో నిందితులపై పోస్కో చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలను స్కూల్ యాజమాన్యం తోసిపుచ్చింది.
స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు జూన్ 26 నుంచి ఎలాంటి దృశ్యాలను రికార్డ్ చేయడం లేదని పోలీసులు తెలిపారు. తల్లితండ్రుల ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూడాల్సి ఉందని పోలీసులు చెప్పారు.