డీసీఎంను ఢీకొన్న లారీ : ముగ్గురు మృతి | three labours died in lorries accident | Sakshi
Sakshi News home page

డీసీఎంను ఢీకొన్న లారీ: ముగ్గురు మృతి

Jan 3 2018 8:34 AM | Updated on Aug 25 2018 6:13 PM

two labours died in lorries accident - Sakshi

అశ్వాపురం: భద్రాద్రికొత్తగూడెంజిల్లా అశ్వాపురం మండలం మొండికుంట వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతిచెందారు. బీఎస్ఎన్ఎల్ పైపులు దింపుతున్న డీసీఎంను మరో లారీ ఢీకొంది. ఈ సంఘటనలో పైపులు దింపుతున్న కూలీ శివరాత్రి గోపయ్య (50), డీసీఎం డ్రైవర్ భాగ్యరావు(23) అక్కడికక్కడే మృతిచెందారు. మరో పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతులు, గాయపడిన వారు గుంటూరుకు చెందిన కూలీలు. కాగా, భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement