డాబాపై చిన్నారి తల.. ఇద్దరి అరెస్టు | two arrested in  child sacrifice in hyderabad | Sakshi
Sakshi News home page

డాబాపై చిన్నారి తల.. ఇద్దరి అరెస్టు

Feb 2 2018 1:24 PM | Updated on Sep 4 2018 5:37 PM

 two arrested in  child sacrifice in hyderabad - Sakshi

ఉప్పల్‌  చిలుకానగర్‌లో రాజశేఖర్ అనే వ్యక్తి ఇంటిపై పాప తల దొరికిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌  చిలుకానగర్‌లో రాజశేఖర్ అనే వ్యక్తి ఇంటిపై చిన్నారి తల దొరికిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. రాజశేఖర్ ఇంటి సమీపంలో క్షుద్రపూజలు జరిగినట్టు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో స్థానికంగా ఉంటున్న మెకానిక్‌ నరహరి ఇంటిలో క్షద్ర పూజలు జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నరహరి, అతని కొడుకు రంజిత్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రహణ సమయంలో పూజలు చేసి చిన్నారిని బలిచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. చిన్నారి మృతదేహం ఇంకా లభించలేదు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.

ఉప్పల్‌ సర్కిల్‌ చిలుకానగర్‌ డివిజన్‌ పరిధిలోని మైసమ్మ దేవాలయం సమీపంలో నివసించే రాజశేఖర్‌ (35) క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం కుటుంబమంతా మేడారం జాతరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయన అత్త బాలలక్ష్మి ఉతికిన బట్టలు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లారు. అక్కడ ఎవరో చిన్నారి తల కనబడటంతో వచ్చి కుటుంబీకులకు చెప్పారు. డాబాపైకి వెళ్లి చూసిన రాజశేఖర్‌.. వెంటనే ఉప్పల్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. చిన్నారి తల దొరికిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement