ట్యూషన్‌లో మృగాడు | Tution Teacher Trying to Molestation on Tenth Student | Sakshi
Sakshi News home page

ట్యూషన్‌లో మృగాడు

Dec 6 2019 8:25 AM | Updated on Dec 6 2019 8:25 AM

Tution Teacher Trying to Molestation on Tenth Student - Sakshi

ట్యూషన్‌ మాస్టర్‌ ఆనంద్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు

హొసూరు: దిశ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళన జరుగుతుండగా మరో వైపు కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. విద్య కోసం తన వద్దకు ట్యూషన్‌కు వచ్చిన విద్యార్థినిపై ట్యూషన్‌ మాస్టర్‌ కన్నేసి అత్యాచారానికి     యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై కీచకున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈఘటన  హొసూరు సమీపంలో  నెల్లూరు వద్ద చోటు చేసుకుంది. నెల్లూరు వద్ద మీన అనే మహిళ హాస్టల్‌ నిర్వహిస్తోంది. ఇక్కడ  ఏ నెల్లూరు గ్రామానికి చెందిన తిమ్మన్నగౌడ కొడుకు ఆనంద్‌ ట్యూషన్‌ చెబుతుండేవాడు.

ఈక్రమంలో 10వ తరగతి చదివే  బాలికపై ఆనంద్‌ కన్నేశాడు. బుధవారం ఆ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించగా బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తమై అక్కడకు చేరుకొని ఆనంద్‌ను బంధించారు. అనంతరం హాస్టల్‌ నిర్వాహకురాలు మీనా హొసూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు ఘటనా స్థలానికి చేరుకొనిన ఆనంద్‌ను అరెస్ట్‌ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement