విషాదం : టోల్‌ప్లాజాను తొందరగా దాటాలనే ప్రయత్నంలో

Truck Runs Over Driver To Cross Toll Plaza First In UP - Sakshi

నోయిడా : ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడా టోల్‌ప్లాజా వద్ద శనివారం సాయంత్రం విషాదం చోటు చేసుకుంది. అందరికంటే ముందు టోల్‌ కట్టాలన్న ట్రక్కు డ్రైవర్‌ తాపత్రయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొంది. వివరాల్లోకి వెళితే.. శనివారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో నోయిడా టోల్‌ప్లాజా వద్దకు రెండు ట్రక్కులు ఏకకాలంలో వచ్చాయి. అయితే ఎవరి ట్రక్కు ముందు వెళ్లాలనే విషయంపై ఇరు డ్రైవర్ల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ‍్యంలో ఒక ట్రక్కు డ్రైవర్‌ తన వాహనాన్ని ముందుకు తీయడానికి ప్రయత్నించగా మరో ట్రక్కు డ్రైవర్‌ దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఇది పట్టించుకోకుండా సదరు ట్రక్కు డ్రైవర్‌ తన వాహనాన్ని అలాగే ముందుకు తీయడంతో మరో డ్రైవర్‌ పైనుంచి వాహనం వెళ్లడంతో అక్కడిక్కడే మరణించాడు. అయితే ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవిలో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సీసీటీవి ఫుటేజీ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదంలో మరణించిన ట్రక్కు డ్రైవర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top