డ్యాన్సర్‌పై లైంగిక దాడి : ముగ్గురి అరెస్ట్‌ | Three Arrested For Raping Haryana Based Dancer | Sakshi
Sakshi News home page

డ్యాన్సర్‌పై లైంగిక దాడి : ముగ్గురి అరెస్ట్‌

Apr 6 2019 12:16 PM | Updated on Apr 6 2019 1:27 PM

Three Arrested For Raping Haryana Based Dancer - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : హర్యానాకు చెందిన డ్యాన్సర్‌పై ఢిల్లీలోని కజౌరి ఖాస్‌లో జరిగిన లైంగిక దాడి కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐదు రోజుల కిందట ఓ షోలో పాల్గొనేందుకు వచ్చిన 20 సంవత్సరాల డ్యాన్సర్‌పై కన్నేసిన ముగ్గురు నిందితులు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టారు. హర్యానా నుంచి బస్సులో ఢిల్లీలోని కశ్మీరీ గేట్‌ వద్దకు చేరుకున్న యువతికి ముగ్గురు నిందితులు మాయమాటలు చెప్పి ఈవెంట్‌ జరిగే వేదిక వద్దకు తీసుకువెళతామని నమ్మబలికారు.

ఆమెను బవానా ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని, తిరిగి ఆమెను ఖజురి చౌక్‌ ప్రాంతంలో విడిచిపెట్టి బాధితురాలి సెల్‌ఫోన్‌ను తీసుకుని పరారయ్యారని పోలీసులు తెలిపారు. నిందితులు లోకేష్‌ (21), హృషీకేష్‌(25), ఓం (25)లను అరెస్ట్‌ చేశామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement