చోరీ చేస్తూ పట్టుబడిన దొంగ | Thief Caught While Robbery in House Nalgonda | Sakshi
Sakshi News home page

చోరీ చేస్తూ పట్టుబడిన దొంగ

Jul 17 2020 1:03 PM | Updated on Jul 17 2020 1:03 PM

Thief Caught While Robbery in House Nalgonda - Sakshi

దొంగని పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్న పీసీ

గుండాల : చోరీ చేస్తుండగా దొంగను పట్టుకొని పోలీసులకు అప్పజెప్పిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మోత్కూరు పట్టణానికి చెందిన పల్లపు ఉపేందర్‌ గ్రామంలోని తాటిచెట్టు మల్లిఖార్జున్‌ ఇంట్లోకి చొరబడి సెల్‌ఫోన్‌ చోరీ చేసి అనంతరం కిరాణం షాపులో డబ్బులు తీస్తుండగా శబ్దం అయింది. దీంతో గమనించిన కుటుంబ సభ్యులు ఉపేందర్‌ని పట్టుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement