ఎన్‌కౌంటర్లో మసూద్‌ అజర్‌ బంధువు హతం  | Terrorist Leader Masood Azhars Nephew killed Along With 2 Other Terrorists In Tral Encounter | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్లో మసూద్‌ అజర్‌ బంధువు హతం 

Oct 31 2018 9:44 AM | Updated on Oct 31 2018 9:44 AM

Terrorist Leader Masood Azhars Nephew killed Along With 2 Other Terrorists In Tral Encounter - Sakshi

ఉగ్రవాద నాయకుడు మసూద్‌ అజార్‌

త్రాల్‌ ప్రాంతంలో గత 10 రోజుల్లో భద్రతా దళాలపై జరిగిన దొంగచాటు దాడులకు ఉస్మాన్‌ నాయకత్వం వహించినట్లు..

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌కు దగ్గరి బంధువు మహ్మద్‌ ఉస్మాన్‌ హతమయ్యాడు. త్రాల్‌ ప్రాంతంలో గత 10 రోజుల్లో భద్రతా దళాలపై జరిగిన దొంగచాటు దాడులకు ఉస్మాన్‌ నాయకత్వం వహించినట్లు సమాచారం. మంగళవారం నాటి ఎన్‌కౌంటర్‌ కూడా త్రాల్‌ ప్రాంతంలోనే జరగ్గా జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

ఘటనా స్థలం నుంచి ఒక ఎం–4 కార్బైన్‌ తుపాకీని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భద్రతా బలగాలపై దొంగచాటుగా కాల్పులు జరిపేందుకు ఈ తుపాకులను వారు ఉపయోగించి ఉండొచ్చని అధికారులు చెప్పారు. మంగళవారం నాటి ఎన్‌కౌంటర్‌తో భద్రతా దళాలకు ఈ ఏడాదిలోనే గొప్ప విజయం లభించినట్లైందని ఓ అధికారి పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement