లాటరీ టికెట్ల దందా : టీడీపీ నాయకుడు అరెస్ట్‌ | TDP leader Held in Lottery Tickets Sales Case Chittoor | Sakshi
Sakshi News home page

లాటరీ టికెట్ల దందా : టీడీపీ నాయకుడు అరెస్ట్‌

Jun 5 2020 12:44 PM | Updated on Jun 5 2020 12:44 PM

TDP leader Held in Lottery Tickets Sales Case Chittoor - Sakshi

లాటరీ టికెట్ల కేసులో అరెస్టయిన నిందితులు చంద్రశేఖర్, రియాజ్, రషీద్‌

చిత్తూరు, పుంగనూరు: పట్టణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు చంద్రశేఖర్‌  చట్టవిరుద్ధంగా లాటరీ టికెట్ల వ్యాపారంలో అరెస్ట్‌ అయ్యాడు. గురువారం సీఐ గంగిరెడ్డి విలేకరులకు తెలిపిన మేరకు.. పట్టణంలోని ఓ మాజీ కౌన్సిలర్‌ భర్త చంద్రశేఖర్‌ తన అనుచరులైన రియాజ్‌బాషా, రషీద్‌బాషాతో కలసి లాటరీ టికెట్లు విక్రయిస్తుండగా ఈనెల 2వ తేదీన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. దీనిపై దర్యాప్తు చేసి ఉదయం 9 గంటలకు బస్టాండులో ఉండగా చంద్రశేఖర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి 12 లాటరీ టికెట్లను, రూ.4,790 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండుకు తరలించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement