గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత | Taskforce Police Catches Gold Smuglers In Gannavaram Airport | Sakshi
Sakshi News home page

గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

Feb 13 2020 12:09 PM | Updated on Feb 13 2020 12:18 PM

Taskforce Police Catches Gold Smuglers In Gannavaram Airport - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి,విజయవాడ : విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో 20కేజీల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం  అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి ఎటువంటి బిల్లులు లేకుండానే కార్గో కొరియర్‌ ద్వారా బంగారు, వెండి ఆభరణాలను విజయవాడకు తరలిస్తున్నట్లు తెలిపారు. పన్నులు ఎగ్గొట్టి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారని, నగరంలోని పలు బంగారు దుకాణాల్లో సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా పట్టుబడ్డ బంగారం విలువ సుమారు రూ.17 కోట్లుగా ఉంటుందని, అలాగే వారి వద్ద నుంచి రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement