యువకుడి ఆత్మహత్య | Suicide of a young man | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Oct 4 2017 1:33 AM | Updated on Nov 6 2018 8:08 PM

Suicide of a young man - Sakshi

టీ.నగర్‌: తిరువొత్తియూరులో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరువొత్తియూరు సమీపాన గల పళవేతొట్టికుప్పం ప్రాంతానికి చెందిన నరేష్‌ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి పక్కింటి యువకుడు నవీన్‌(18)తో తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో సోమవారం వారి మధ్య మళ్లీ తగాదా ఏర్పడింది.

ఆ సమయంలో నవీన్‌ అతని స్నేహితులు కలిసి నరేష్‌పై దాడికి ప్రయత్నించినట్టు తెలిసింది. దీన్ని అవమానంగా భావించిన నరేష్‌ తన ఇంటి సమీపాన ఉన్న మర్రిచెట్టుకు సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement