పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం | Suicide attempt before police station | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం

Mar 1 2018 6:30 AM | Updated on Nov 6 2018 7:53 PM

Suicide attempt before police station - Sakshi

రామకృష్ణను ఆసుపత్రికి తరలిస్తోన్న పోలీసులు

వైరారూరల్‌: మండలంలోని రెబ్బవరం గ్రామానికి చెందిన సట్టి రామకృష్ణ, బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఎదుట పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఎస్సై తాండ్ర నరేష్‌ తెలిపిన వివరాలు.. తనను రామకృష్ణ వేధిస్తున్నాడంటూ రెబ్బవరం గ్రామస్తురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఇందులో భాగంగా అతడిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. అతడు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని, తనతోపాటు తెచ్చుకున్న పురుగు మందును తాగాడు. పోలీసులు గమనించి, వెంటనే వైరాలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement