గోదావరిలోకి దూకి విద్యార్థి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన అప్పులు

Published Thu, Apr 5 2018 11:33 AM

Student Suicide Jumps In Godavari River - Sakshi

ధర్మపురి : మంచం పట్టిన తండ్రి వైద్యానికి చేసిన అప్పులు పెరిగిపోయాయి. అప్పిచ్చిన వారు ఇంటిఎదుట ఆందోళన చేయడంతో మనస్తాపం చెందిన యువకుడు గోదావరిలో దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం రాయపట్నం గ్రామం లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోతరాజుల వెంకటేశ్‌– రాజవ్వ దంపతులకు కూతురు భవాని, కుమారుడు శ్రీకాంత్‌(20) ఉన్నారు. భవానికి 9 నెలల క్రితం వివాహమైంది. శ్రీకాంత్‌ ఈ ఏడాదే ఇంటర్‌ పూర్తి చేశాడు. కూలీపని చేస్తూ జీవించే కుటుంబంలో ఐదేళ్లక్రితం విషాదం నెల కొంది. ఇంటిపెద్ద వెంకటేశ్‌ పక్షవాతంతో మంచం పట్టా డు. అప్పటి నుంచి అప్పుచేసి వెంకటేశ్‌కు వైద్యమందించారు.ఇప్పటి వరకు సుమారు రూ. 3లక్షలు ఖర్చు చేశా రు. అయినా వెంకటేశ్‌ కోలుకోలేదు. భవాని వివాహనానికి మరో రూ.4 లక్షల అప్పులయ్యాయి. అప్పులు పెరిగిపోవడంతో ఇచ్చినవారు ఇంటిఎదుటకు వచ్చిన ఆందోళన చేయడం ప్రారంభించారు. దీంతో శ్రీకాంత్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రాయపట్నం బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొ డుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై లక్ష్మినారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement