హోదా కోసం ప్రాణం ఇస్తున్నా..  | Student Suicide For AP Special Category Status In Kurnool | Sakshi
Sakshi News home page

Sep 18 2018 8:16 AM | Updated on Mar 23 2019 9:10 PM

Student Suicide For AP Special Category Status In Kurnool - Sakshi

ఆత్మహత్య చేసుకున్న మహేంద్ర, పక్కన సూసైడ్‌ నోట్‌

సాక్షి,  ప్యాపిలి(కర్నూలు) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్న మనస్తాపంతో కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన విద్యార్థి మహేంద్ర (14) సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న మహేంద్ర మృతదేహం వద్ద సూసైడ్‌ నోట్‌ లభించింది. తమ కుటుంబానికి చాలా అప్పులున్నాయని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చుంటే తన అన్నకి ఏదో ఒక ఉద్యోగం వచ్చేదని, హోదా ఇవ్వకపోవడం వల్ల తాను చదువుకున్నా.. ఉద్యోగం రాదని నోట్‌లో పేర్కొన్నాడు. తెలంగాణ కోసం చాలామంది బలిదానాలు చేశారని, హోదా కోసం తానూ చనిపోతున్నానంటూ సూసైడ్‌ నోట్‌లో రాసి ఉంది. మహేంద్ర సోదరుడు తిరుపాల్‌నాయుడు డోన్‌లో డిగ్రీ చదువుతున్నాడు. విద్యార్థి తండ్రి మద్దిలేటి నాయుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జలదుర్గం ఎస్‌ఐ సురేష్‌ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement