తూర్పుగోదావరిలో దారుణం.. | Son Killed Mother In East Godavari District | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం కన్నతల్లిని కడతేర్చిన కసాయి

Mar 21 2020 10:46 AM | Updated on Mar 21 2020 10:54 AM

Son Killed Mother In East Godavari District - Sakshi

సాక్షి, కాకినాడ: ఆస్తి కోసం కన్నతల్లినే హతమార్చిన కసాయి కొడుకు ఉదంతం తూర్పుగోదావరి జిల్లాలో శనివారం జరిగింది. పత్తిపాడు మండలం రౌతు పాలెం గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఆస్తి రాయిలేదనే కోపంతో నిమ్మల శ్రీనివాస్‌ అనే వ్యక్తి  టీవీ చూస్తున్న తన తల్లి నూకరత్నాన్ని కర్రతో తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement