‘ప్యారిస్‌’ ఫ్రమ్‌ మయన్మార్‌!

Smuggling of cigarette packets In Sampark Kranti Express - Sakshi

రైలులో సిగరెట్‌ ప్యాకెట్ల అక్రమ రవాణా

కాచిగూడ స్టేషన్‌లో దాడి చేసిన డీఆర్‌ఐ

సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో భారీగా స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వానికి పన్నుపోటు, పొగరాయుళ్ల ఆరోగ్యానికి చేటుగా మారుతున్న విదేశీ సిగరెట్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు ఈ స్మగ్లింగ్‌పై డేగకన్ను వేశారు. ఫలితంగా 13 రోజుల వ్యవధిలో రూ.7 కోట్ల విలువైన సిగరెట్లు పట్టుబడ్డాయి. ఈ నెల 2న రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపోలో రూ.6.33 కోట్ల విలువైన సిగరెట్లు చిక్కిన విషయం విదితమే. దీనికి కొనసాగింపుగా శుక్రవారం డీఆర్‌ఐ బృందం కాచిగూడ రైల్వేస్టేషన్‌లో దాడులు చేసింది.

సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో సోదాలు నిర్వహించి రూ.65.96 లక్షల విలువైన ప్యారిస్‌ బ్రాండ్‌ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న స్మగ్లర్‌ తప్పించుకోగా... ప్రాథమిక ఆధారాలను బట్టి ఆ సిగరెట్లు మయన్మార్‌ నుంచి వచ్చినట్లు గుర్తించారు. 132 కార్టన్స్‌లో ఉన్న 13.19 లక్షల సిగరెట్లును డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. గతంలో తిమ్మాపూర్‌ డిపోలో దొరికిన వాటిలో లండన్‌ తయారీ బెన్సన్‌ అండ్‌ హెడ్జెస్, యూఏఈకి చెందిన మోండ్‌ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు ఉన్న విషయం విదితమే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top