డ్రంకన్‌ డ్రైవ్‌లో ఏడుగురికి జైలు శిక్ష

Seven people were jailed for drunken drive - Sakshi

సంగారెడ్డి : మద్యం తాగి వాహానాలు నడుపుతున్న వ్యక్తులను నియంత్రించడానికి పోలీసులు డ్రంకన్‌డ్రైవ్‌ నిర్వహించడంతో ఏడుగురు పట్టుబడ్డారు. గురువారం వీరిని కోర్టులో హాజరుపరిచారు. సంగారెడ్డి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఐదుగురిని కోర్టులో  ప్రవేశపెట్టగా ఒకరికి రెండు రోజులు, నలుగురికి ఒక రోజు జైలు శిక్ష విధించారు.

సంగారెడ్డి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఒకరిని కోర్టులో ప్రవేశ పెట్టగా ఒకరోజు జైలు శిక్ష విధించారు. కొండాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఒకరిని కోర్టులో ప్రవేశ పెట్టగా రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ ఏడీఎం కోర్టు మెజిస్ట్రేట్‌ దేవి తీర్పు ఇచ్చారని సీఐ సంజయ్‌కుమార్‌ తెలిపారు.

Back to Top