టీచర్‌పై సామూహిక అత్యాచారం

సిధి/దమోహ్/మోవ్: మధ్యప్రదేశ్‌లో ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిపై సామూహిక అత్యాచారం జరగగా, మరో చోట వేధింపులు తాళలేక ఓ టీనేజర్ ఆత్మహత్య చేసుకుంది. రెండు ఘటనలు గురువారం జరగ్గా ఆలస్యంగా వెలుగులో కొచ్చాయి. సిధిలో సాయంత్రం స్కూల్ ముగించుకొని తిరిగి వస్తున్న టీచర్‌పై నలుగురు స్థానికులు దగ్గర్లోని ఓ ఫాంహౌజ్‌కు ఎత్తుకెళ్లి గ్యాంగ్‌రేప్ చేశారు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో అక్కడి నుంచి పారిపోయారు.
అనంతరం ఆమె ఇంటికెళ్లి వివరాలను తెలపడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు, దమోహ్‌లో 17 ఏళ్ల బాలిక గురువారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక యువకులు కొందరు ఆమెను వేధింపులకు గురి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి