హెలికాప్టర్‌ క్రాష్‌.. యువరాజు దుర్మరణం | Saudi Arabia Prince dies In a Helicopter Crash | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్‌ క్రాష్‌.. యువరాజు దుర్మరణం

Nov 6 2017 9:14 AM | Updated on Aug 20 2018 7:33 PM

Saudi Arabia Prince dies In a Helicopter Crash - Sakshi

రియాద్‌ : హెలికాప్టర్‌ క్రాష్‌ కావడంతో సౌదీ అరేబియా యువరాజులలో ఒకరైన మన్సూర్‌ బిన్‌ మోక్రెన్‌ దుర్మరణం చెందాడు. మన్సూర్‌తో పాటు కొందరు ఉన్నతాధికారులు మృత్యువాత పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దక్షిణ సరిహద్దు యెమెన్‌ ప్రావిన్స్‌లో యువరాజు, అధికారులు ప్రమాణిస్తోన్న హెలికాప్టర్‌ ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం.

అసిర్‌ ప్రావిన్స్‌కి ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్న మన్సూర్‌ బిన్‌ మోక్రెన్‌ మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సౌదీ సింహాసనాన్ని అధిష్టించిన వారిలో బాధిత యువరాజు తండ్రి ఒకరన్న విషయం తెలిసిందే. హెలికాప్టర్‌ ఎందుకు కుప్పకూలిందన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు.

ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రిన్స్‌ సల్మాన్‌ అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా 11 మంది యువరాజులను, నలుగురు ప్రస్తుత మంత్రులను, డజనుకుపైగా మాజీ మంత్రులను శనివారం అరెస్టు చేయించిన విషయం తెలిసందే. ఆ మరుసటిరోజే (ఆదివారం) హెలికాప్టర్‌ కుప్పకూలిపోయి యువరాజులలో ఒకరైన మన్సూర్‌ బిన్‌ మోక్రెన్‌ దుర్మరణం చెందడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి .

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement