తప్పిన ప్రమాదం.. 21 మంది సురక్షితం | RTC bus crashed into the house At Nuziveedu In Krishna District | Sakshi
Sakshi News home page

Jan 10 2019 4:28 PM | Updated on Jan 10 2019 4:39 PM

RTC bus crashed into the house At Nuziveedu In Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా : అతివేగంతో వస్తున్న విజయవాడకు చెందిన ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించబోయి ఇంట్లోకి దూసుకెళ్లెంది. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజువీడు పట్టణం తిరువూరు రోడ్డులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. కాగా బస్సులోని 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. డ్రైవర్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అకస్మాత్తుగా ప్రమాదం జరుగడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement