పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

Rtc Bus Accident In Sangareddy District - Sakshi

10 మందికి స్వల్ప గాయాలు

నారాయణఖేడ్‌: సంగారెడ్డి జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు శనివారం మధ్యాహ్నం పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి స్వల గాయాలయ్యాయి. నారాయణఖేడ్‌ డిపోకు చెందిన టీఎస్‌ 15 జెడ్‌ 0154 నంబరు గల బస్సు 30 మంది ప్రయాణికులతో నారాయణఖేడ్‌ నుంచి లింగంపల్లికి వెళుతుండగా పట్టణ శివారులో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న బోడగట్టుకు చెందిన సంజీవ్‌తోపాటు మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

రోడ్డు పక్కన గోతులు ఉండడం, వాటిని పూడ్చే పనులు జరుగుతుండడంతో బస్సు అదుపుతప్పింది. కాగా, బస్సు డ్రైవర్‌ మద్యం తాగి నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రయాణికులు ఆరోపించారు. దీంతో ఆర్టీసీ అధికారులు బ్రీత్‌ అనలైజర్‌తో పరీక్షలు జరపగా డ్రైవర్‌ మద్యం తాగ లేదని తేలింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top