సెల్‌ఫోన్‌ దుకాణంలో చోరీ

robbery in mobile store - Sakshi

చౌటుప్పల్‌(మునుగోడు) : మండల కేంద్రంలోని చిన్నకొండూరు చౌరస్తాలో ఇటీవల ఏర్పాటు చేసిన ఎంఎం సెల్‌ఫోన్‌ దుకాణంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఈ దొంగతనం ఏ అర్ధరాత్రో జరుగలేదు. జన సంచారం బాగా ఉన్న పదిన్నర  గంటలకే దొంగలు తమ పనిని మొదలు పెట్టారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..  దుకాణ యజమాని సొప్పరి శంకర్‌  వేరే ప్రాంతంలో ఉన్న షాపును ఇటీవలనే ఈ చౌరస్తాలోకి  మార్చాడు.  తను తీసుకున్న మడిగె మూడంతస్తులు ఉన్నప్పటికీ అందులో వేరే దుకాణాలు ఏర్పాటు చేసే విధంగా లేకపోవడంతో మడిగె మొత్తం వీరి ఆధీనంలోనే ఉంది.  యజమానితోపాటు పని వాళ్లు సైతం  ఒకేసారి బయలుదేరుతారు. అందులో భాగంగా గత రాత్రి విపరీతమైన చలి కారణంగా  తొమ్మిదిన్నర ప్రాంతంలో దుకాణా న్ని మూసేసి వెళ్లిపోయారు. ఉదయం పది గంటల ప్రాంతంలో దుకాణం తెరిచిన తర్వాత దొంగతనం విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అం దించారు.

దొంగలుపై అంతస్తు నుంచి వచ్చి డోరు ను పగులగొట్టి దుకాణంలోనికి  ప్రవేశించారు.  తమ వెంట తెచ్చుకున్న గ్లౌజులను చేతులకు వేసుకోవడంతో పాటు దుకాణంలో ఉన్న పాత కవర్లు, ద్విచక్ర వాహనం హెల్మెట్‌ను తలకు ధరించారు. మరో కవర్లును కాళ్లకు వేసుకున్నారు.  చాలా విలువైన సామ్‌సంగ్, వీవో, రెడ్‌మీ కంపెనీలకు చెందిన 20 సెల్‌ఫోన్‌లను ఎత్తుకెళ్లారు. పనిలో పనిగా అక్కడే ఉన్న 30 వేల విలువైన ల్యాప్‌టాప్, కౌంటర్‌లో ఉన్న 39వేల నగదును ఎత్తుకెళ్లారు. సెల్‌ఫోన్ల విలువ సుమారుగా 2.50లక్షల వరకు ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు. ఎక్కడ కూడా తమ వేలి ముద్రలు నమోదు కాకుండా పక్కాగా వ్యవహరించారంటే వారు ఆరితేరినవారుగా పలువురు అనుమానిస్తున్నారు. దొంగతనం దృశ్యాలన్నీ సీసీకెమెరాలో రికార్డయ్యాయి. ఘటనా స్థలాన్ని రాచకొండ కమిషనరేట్‌ క్రైమ్‌ అడిషనల్‌ డీసీపీ సలీమా, స్థానిక ఏసీపీ రామోజు రమేష్, సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ నవీన్‌బాబులు సందర్శించారు.  ప్రింగర్‌ప్రింట్‌లో కొంతమేరకు ప్రింట్‌లను సేకరించారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నవీన్‌బాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top