మొబైల్‌ షాప్‌లో చోరీ | Robbery in Mobile Showroom Medak | Sakshi
Sakshi News home page

మొబైల్‌ షాప్‌లో చోరీ

Feb 4 2020 10:39 AM | Updated on Feb 4 2020 10:39 AM

Robbery in Mobile Showroom Medak - Sakshi

రేకులు పగులగొట్టిన దృశ్యం

మనోహరాబాద్‌(తూప్రాన్‌): అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు మొబైల్‌ షాపు రేకులు పగులగొట్టి అందులోంచి విలువైన మొబైల్‌ ఫోన్లను చోరీ చేసిన సంఘటన మనోహరాబాద్‌ మండలం కాళ్ళకల్‌ గ్రామ ప్రధాన చౌరస్తా వద్ద బాలాజీ మొబైల్స్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం షాపు యజమాని భగవాన్‌దాస్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన మొబైల్‌ షాపులో దాదాపు రూ.12 నుంచి 18 వేల  విలువైన వివో, ఒప్పో, రెడ్‌మీ ఫోన్లు, తదితర ఫోన్లు ఉన్నాయని వాటిలోంచి దాదాపై రూ.3 లక్షల విలువైన వాటిని చోరీ చేసినట్లు తెలిపారు. తన షాప్‌కు పుకు ఇనుప రేకులు, వాటి కింద సిమెంట్‌ రేకులు, వాటి ఫాల్‌ సీలింగ్‌ ఉందని తెలిపారు. వాటిని ధ్వంసం చేసి చోరీ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన సాయంత్రం వరకు పోలీసులు రాకపోవడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement