హిజ్రాల ముసుగులో చోరీ | Robbery in Dress Up Hijra Hyderabad | Sakshi
Sakshi News home page

హిజ్రాల ముసుగులో చోరీ

Aug 15 2019 7:35 AM | Updated on Aug 15 2019 7:35 AM

Robbery in Dress Up Hijra Hyderabad - Sakshi

పోలీసుల అదుపులో నిందితులు

మల్లాపూర్‌: హిజ్రాల వేషంలో ఆటోల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సీసీఎస్‌ మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం నాచారం సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో   రాచకొండ క్రైమ్‌  అడిషనల్‌ డీసీపీ సలీమా వివరాలు వెల్లడించారు. బోడుప్పల్‌ కళానగర్‌కు చెందిన తూర్పాటి యాదయ్య, సదుల ఆంజనేయులు, హిజ్రాలుగా వేషం వేసుకొని కల్లెం బాబయ్య ఆటోలో తిరుగుతూ భిక్షాటన చేసేవారు. ఇటీవల చర్లపల్లిలో ఓ మహిళ దృష్టి మరల్చి రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సీసీఎస్‌ మల్కాజిగిరి, కుషాయిగూడ పోలీస్‌ అధికారులు సీసీ ఫుటేజీల ఆధారంగా ఆటోను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు.వారి నుంచి రూ.42 వేల నగదు, ఆటోను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.  సమావేశంలో ఏసీపీ శివకుమార్, ఇన్‌స్పెక్టర్లు లింగయ్య, జగన్నాధరెడ్డి, మక్బుల్‌ జానీ, భాస్కర్, డీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement